జోరు వానలోనూ వీఆర్ఏల రిలే దీక్షలు

జోరు వానలోనూ వీఆర్ఏల రిలే దీక్షలు

2
TMedia (Telugu News) :

జోరు వానలోనూ వీఆర్ఏల రిలే దీక్షలు

టి మీడియా, జూలై22,ఖమ్మం : వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి . ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ వీఆర్ఏలు అధిక సంఖ్యలో హాజరయ్యారు . వర్షంలో తడుస్తూ కూడా వారు నినాదాలు చేశారు . వీఆర్ఏల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లింగరాజు మాట్లాడుతూ నిన్న మహబూబాబాద్ కేంద్రంలో వీఆర్ఏల ధర్నా శిబిరం వద్దకు సి.ఐ వచ్చి బెదిరింపులకు పాల్పడడాన్ని మరియు ఈరోజు సిరిసిల్లలో వీఆర్ఏల అక్రమ అరెస్టులను వారు ఖండించారు . శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని దానిని హరిస్తే జరిగే పర్యవసానాలు కు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు .

 

Also Read :వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటన

జిల్లా జెఎసి చైర్మన్ అజిజ్ మాట్లాడుతూ వర్షంలో సైతం ఇంత భారీ ఎత్తున విఆర్ఎల్ హాజరవడం వారి మనోవేదనను తెలియపరుస్తుందని . కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని కోరారు . రేపు నిర్వహించ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో వీఆర్ఏల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చల్లా లింగరాజు , జిల్లా చైర్మన్ అజిజ్ , సెక్రటరీ నాగరాజు , జిల్లా మహిళా అధ్యక్షురాలు రమాదేవి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు , కో కన్వినర్ లు అన్వార్ , ఉపేందర్ , పాషా, వెంకటేశ్వర్లు , జానీ , మురళి , అన్ని మండల అధ్యక్షులు , కార్యదర్శి లు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube