40వ రోజుకు చేరిన వి ఆర్ ఎ ల నిరవధిక సమ్మె

40వ రోజుకు చేరిన వి ఆర్ ఎ ల నిరవధిక సమ్మె

1
TMedia (Telugu News) :

40వ రోజుకు చేరిన వి ఆర్ ఎ ల నిరవధిక సమ్మె

టీ మీడియా సెప్టెంబర్ 02ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేంద్రం లోని అరకోర వేతనాలతో ఎట్లా మండల అధ్యక్షుడు ముస్కుల శివకుమార్ నేటికీ 40 వ రోజుకు చేరిన వి ఆర్ ఎ ల సమ్మె,ఈ సందర్భంగా వి ఆర్ ఏ ల మండల అధ్యక్షుడు మస్కుల శివ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రత్యక్ష,వారసత్వ వి ఆర్ ఎ లు సుమారు 23000 మంది ఉన్నారు అని వీరు గ్రామాల్లో చాలి చాలని వేతనాలతో ఎన్నో సంవ్సరాలుగా పనిచేస్తున్నారూ అని,పేరు లో ఉన్న గౌరవం వేతనం లో లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Also Read : రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు

ప్రస్తుతం వి ఆర్ ఏ లకు గౌరవ వేతనం 10500 మాత్రమే ఇస్తున్నారు అని,ఈ వేతనం కుటుంబ పోషణకు భారం అవుతుందని అప్పులు చేయాల్సి వస్తుంది అని పేర్కొన్నారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రగతిభవన్ మరియు అసెంబ్లీ సాక్షిగా వి ఆర్ ఎ లకు పేస్కేల్, పదోన్నతులు మరియు వారసులకు ఉద్యోగాలు కల్పస్తామని హమిలు ఇచ్చి ఐదున్నర సంవస్సరాలు అయిన మోక్షం లభించలేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ హామీలన్నిటిని నెరవేర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వి ఆర్ ఎ ల ప్రధాన కార్యదర్శి కురాకుల రాజు ఉప అధ్యక్షడు నాగరాజు కన్వీనర్ శివ మరియు మండల వి ఆర్ ఎ లు అందరు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube