విఆర్ఎ ల నిరాహార దీక్షలు

విఆర్ఎ ల నిరాహార దీక్షలు

0
TMedia (Telugu News) :

విఆర్ఎ ల నిరాహార దీక్షలు

టీ మీడియా ,జూలై 26,తిరుమలాయపాలెం : మండల కేంద్రంలో సోమవారం వీఆర్ఏ లు తాసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీఆర్ఏల ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ అజిజ్ మండల కమిటీ మండల అధ్యక్షులు మెంటం శ్రీనివాస్ మాట్లాడుతూ 2020 సెప్టెంబరు 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా వి ఆర్ ఎ ల అందరికీ పే స్కేలు రాస్తారని వారి వారసులకు తండ్రుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని నిండు సభలో స్వయానా గౌరవ అ ముఖ్యమంత్రి గారు ప్రకటించారని ఇట్టి హామీలను వెంటనే నెరవేర్చాలని అర్హత కలిగిన వారికి ప్రమోషన్ లను ఇవ్వాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి హక్కులు నెరవేరలేదని కనుక ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని లేకుంటే వీఆర్ఏల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని చాలీచాలని జీతంతో తో కుటుంబాలను అను పోషించుకుంటూ ఉన్నామన్నారు కనుక అసెంబ్లీలో ప్రకటించిన హామీలను వెంటనే జీవో జారీ చేయాలని కోరుకుంటున్నామన్నారు.

 

Also Read : నూతన మండలంగా ‘ఇనుగుర్తి

 

అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పే స్కేల్ జీవోను విడుదల చేయాలని అర్హత కలిగిన పి ఆర్ ఏ ల కి ప్రమోషన్లు కల్పించాలని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారి ఇ వారసులకు వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని తిరుమలాయపాలెం తాసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు గుర్రాల సుదర్శన్ గడ్డి కోప్పలు కిరణ్ పంది వీరయ్య పూజ నరసయ్య వంగూరి రామకృష్ణ షేక్ ఖాసిమ్ పల్లి ఆనంద్ కొవ్వూరు జోష్న ప్రభాస్ని దంతాలు వెంకన్న మోహిన్ గుంతేటి రామస్వామి ఎలక చంద్రయ్య నీరుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube