70 వ రోజుకి వి ఆర్ ఏ నిరవధిక సమ్మె

70 వ రోజుకి వి ఆర్ ఏ నిరవధిక సమ్మె

1
TMedia (Telugu News) :

70 వ రోజుకి వి ఆర్ ఏ నిరవధిక సమ్మె

టి మీడియా, అక్టోబర్ 2 వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 70వ రోజుకు చేరింది. వెంకటాపురం మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెదీక్ష శిభిరం వద్ద ఆదివారం అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ స్వాతంత్రం కోసం ఆయన అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో శాంతియుతంగా పోరాడితే ఇప్పుడు ఈరోజుల్లో ఈ మొండి రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 23 వేల మంది విఆర్ఎ లు తమ హక్కుల కోసం వీఆర్ఏల డిమాండ్స్ ప్లకార్డ్స్ పట్టుకొని శాంతియుతంగా ఇట్టి 70వరోజు నిరవధికసమ్మె నిరసనలు తెలియజేశారు.

Also Read : గాంధీ జయంతి వేడుకలు

నిరసనలో వెంకటాపురం మండల వీఆర్ఏలు అధ్యక్షులు కంటెం బలరాములు, ఉపాధ్యక్షులు రేగ రాజేష్ ,కార్యదర్శి ఉండం శిరీష ,అరుణ , రజిత, సమ్మక్క , సమ్మయ్య , రామస్వామి, ముసలయ్య, తిరుపతమ్మ , లక్ష్మయ్య , కళ్యాణి , బాబ్జి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube