అడ్డు గోడను తొలగించాలని వాకర్స్ డిమాండ్

అడ్డు గోడను తొలగించాలని వాకర్స్ డిమాండ్

1
TMedia (Telugu News) :

అడ్డు గోడను తొలగించాలని వాకర్స్ డిమాండ్

టీ మీడియా ,ఏప్రిల్ 29, రామకృష్ణ పూర్: ఖని రైల్వే స్టేషన్ గాంధారి వనం లోకి ప్రవేశించకుండా నిర్మించిన అడ్డు గోడను తొలగించాలని గాంధారి వనం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.గురువారం ర ఉదయం రైల్వే స్టేషన్ ట్రాక్ కు అటు వైపు ఉన్న గాంధారి గేటు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందల సంఖ్య లో యువకులు,రిటైర్డ్ కార్మికులు ప్రతి రోజు గాంధారి వనం లో వాకింగ్ చేస్తూ వ్యాయామాలు చేస్తున్నామని అన్నారు. ఫారెస్ట్ అధికారులు వనంలోకి వెళ్లకుండా ఇరవై రోజుల క్రితం గోడ నిర్మాణం చేపట్టారని,ఆ విషయాన్ని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దృష్టికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తీసుకెళ్లారని తెలిపారు.

Also Read : వనపర్తి బస్ డిపో ను పరిశీలించిన రీజినల్ మేనేజర్

విప్ స్పందించి సంబధిత ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి చేపట్టిన గోడను తీసివేయాలని చెప్పడంతో అధికారులు తీసివేశారని అన్నారు.గురువారం జాగింగ్ చేద్దామని బయలుదేరిన వారికి ఆ గోడ అడ్డుగా మారిందని, ఈ నేపద్యంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మించిన అడ్డు గోడను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యమే మహా భాగ్యమని భావించి అటవీ శాఖ అధికారులు అడ్డు గోడను తొలగించి,వాకర్స్ కు ప్రవేశం కల్పించాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube