జోడో పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

జోడో పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

జోడో పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

 

టీ మీడియా,అక్టోబర్ 26, మధిర:దేశ సమైక్యత సమగ్రత కోసం భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించినందున జోడో పాదయాత్రకు సన్నాహకంగా మంగళవారం మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర గోడ పత్రికను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….అక్టోబర్ 30 తేదీన రాహుల్‌ యాత్ర హైదరాబాద్‌కు చేరుకుంటుందని అదే రోజు అరంఘార్‌ మీదుగా పాతబస్తీ, చార్మినార్‌, గాంధీభవన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డులోని ఇంధీరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు.

Also Read : నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలి

మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో మధిర పట్టణంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ జోడోయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు మాగం ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube