ఆపరేషన్‌ కోసం రూ. 10 లక్షలు అవసరమన్న వైద్యులు

ఆపరేషన్‌ కోసం రూ. 10 లక్షలు అవసరమన్న వైద్యులు

0
TMedia (Telugu News) :

 

ఆదుకోవాలని పేద కుటుంబం వేడుకోలు
ఆపరేషన్‌ కోసం రూ. 10 లక్షలు అవసరమన్న వైద్యులు
టీ మీడియా, జనవరి 16,నిజామాబాద్‌: బీడీ చుట్టలు చుడితేనే ఆ పేద కుటుంబం జీవనం సాగేది. ఆర్థికంగా ఇబ్బందులున్నా చదువు ఉంటేనే భవిష్యత్తుల్లో ఏదో ఒకరకంగా జీవనం సాగించవచ్చని భావించి పాఠశాలకు పంపుతున్నారు. ఈలోగా తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె యాయత్రికి బోన్‌ క్యాన్సర్‌ అని తెలిసి దోమకొండకు చెందిన బీసు రాజనర్సు, అర్చన దంపతలు ఒక్కసారిగా కుంగిపోయారు.
ఆపరేషన్‌ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల కోసం ప్రస్తుతం ఆ పేద కుటుంబం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల కిందట చేతినొప్పి రావడంతో డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బోన్‌ క్యాన్సర్‌గా ధృవీకరించారు. విద్యార్థిని తండ్రి రాజనర్సు కామారెడ్డిలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, తల్లి అర్చన బీడీలు చుడుతుంది. తమ కుమార్తె వైద్యం కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు రాజనర్సు (ఫోన్‌ నెంబర్‌ 9951068730) అర్చన (7036475197) విజ్ఞప్తి చేశారు.

advt
advt
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube