కేసీఆర్‌ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ప్రగతిభవన్‌లో గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ

1
TMedia (Telugu News) :

కేసీఆర్‌  కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

 

హైదరాబాద్‌: కేసీఆర్‌ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని మహారాష్ట్ర రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్‌మత్‌’ మీడియా సంస్థల ఛైర్మన్‌ విజయ్‌ దర్దా అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన ప్రగతిభవన్‌లో గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయ అంశాలు, దేశ రాజకీయాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలోని భాజపా అసంబద్ధ పాలనతో రోజు రోజుకూ అన్ని రంగాలు దిగజారిపోతున్నాయని విమర్శించారు. దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం తక్షణ అవసరమని ఆయన అన్నారు. శాంతియుత పార్లమెంటరీ పంథాలో ఉద్యమించి తెలంగాణ సాధించడం గొప్ప విషయమన్న విజయ్‌ దర్దా.. దాంతో పాటు అనతికాలంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న తీరు ఆమోఘమని ప్రశంసించారు.

 

ALSO READ :తెలంగాణ లో కుండ పోత వర్షాలు

 

సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్ష, సుపరిపాలనను కొనియాడారు. ఇంతటి పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ నుంచి ఎదగడం దేశానికి శుభసూచకమని విజయ్‌ దర్దా అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ రాజకీయ, పాలనా అనుభవం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దేశ ప్రజల గుణాత్మకాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ లాంటి ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం దేశప్రజలు ఎదురు చూస్తున్నారని.. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని ఆహ్వానించారు. విజయ్‌ దర్దాకు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్‌.. ఆయనను సత్కరించి జ్ఞాపిక అందించారు. విజయ్‌ దర్దా రచించిన ‘రింగ్‌ సైడ్‌’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు అందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube