సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి..
టిమీడియా ,మార్చి 21, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లుగాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్‌పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ మధ్యే ఎల్మగుండలో క్యాంప్ ఏర్పాటు చేశారని తెలిపారు.మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ రెండో బేటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ హేమంత్ చౌధరి, కానిస్టేబుళ్లు బసప్ప, లలిత్ బాఘ్ గాయపడ్డారని చెప్పారు. కాగా, ఆ ప్రాంతంలో మవోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.
Also Read : ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube