రాహుల్‌ సభకు ఓరుగల్లు సిద్ధం

రైతాంగ సమస్యలే ప్రధాన అజెండాగా సభ నిర్వహణ

1
TMedia (Telugu News) :

రాహుల్‌ సభకు ఓరుగల్లు సిద్ధం
కాంగ్రెస్‌ నాయకత్వంభారీ ఏర్పాట్లు
రైతాంగ సమస్యలే ప్రధాన అజెండాగా సభ నిర్వహణ
ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ర్యాలీగా
టి మీడియా,మే 5,హనుమకొండ : హనుమకొండలో శుక్రవారం తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’.. కాంగ్రె్‌సలో జోష్‌ నింపుతోంది. సభ విజయవంతానికి ఆ పార్టీ నేతలు ఒక్కటై కదులుతున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతల నిర్వహణలో తలమునకలయ్యారు. ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వం దిశానిర్దేశం చేయడంతో కాంగ్రెస్‌ శ్రేణులు కదనోత్సాహంతో అడుగులు వేస్తున్నారు. రైతుల సమస్యలే ప్రధాన అజెండగా కాంగ్రెస్‌ సభను నిర్వహిస్తోంది. రైతు శ్రేయస్సే ప్రధాన అజెండగా ’వరంగల్‌ డిక్లరేషన్‌’ను రాహుల్‌గాంధీ ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించిన నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజా సంఘాలు ఇతర వర్గాలో ఆసక్తి నెలకొంది. 15 రోజులుగా ఏఐసీసీ నుంచి జిల్లా నాయకత్వం వరకు ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహణ ప్రణాళికలో పాలుపంచుకుంటున్నారు. సభ కోసం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు వేదికల నిర్మాణం జరుగుతోంది. ఒకటి ప్రధాన వేదిక కాగా, రెండోది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం, మూడో వేదికను సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. సభ ఆరంభానికి ముందు రాహుల్‌గాంధీ రైతు కుటుంబాలను కలిసి ప్రధాన వేదికపై ఆసీనులవుతారు. ఆయనతోపాటు మొత్తం 50 మంది నేతలు కూర్చుంటారు.

Also Read : రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌

ర్యాలీగా తరలనున్న రాహుల్‌..కాజీపేటలోని హెలిప్యాడ్‌ వద్దకు రాహుల్‌గాంధీ సాయంత్రం 5 గంటల సమయంలో చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనాల ర్యాలీ ద్వారా ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు 5:30 గంటలకు చేరుకుంటారు. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున ర్యాలీ ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు నిర్మాణం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభ ప్రధాన అజెండా వ్యవసాయ రంగం, రైతుల సమస్యలే. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రాహుల్‌గాంధీ స్పష్టంగా వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతాంగ సంక్షేమంపై ‘వరంగల్‌ డిక్లరేషన్‌’ను రాహుల్‌ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి. సభకు 5 లక్షల మందిని తరలించాలని టీపీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సభ నేపథ్యంలో నేతల ఫ్లెక్సీలు, కటౌట్లతో నగరమంతా నిండిపోయింది. కాగా, రాహుల్‌ గాంధీ ఓయూ పర్యటించేందుకు అధికారులు అనుమతివ్వాలని వర్సిటీకి చెందిన పలు విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం ఓయూ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్‌ ఈ మేరకు ఆర్ట్స్‌ కాలేజీ నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేపట్టాయి. వీరిని పోలీసులు అడ్డుకుని పది మంది విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నామని ఏఐఎ్‌సఎఫ్‌, పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ విద్యార్థి సంఘాలు బుధవారం ప్రకటించాయి.

Also Read : చండీయాగంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు

24 గంటలపాటు తెలంగాణలోనే …
రాహుల్‌గాంధీ తెలంగాణలో 24 గంటలు ఉంటారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శంశాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌గాంధీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకుంటారు. అక్కడ సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు వచ్చి ఓ హోటల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయమే సంజీవయ్య పార్కులోని సంజీవయ్య సమాధి వద్ద నివాళిని అర్పిస్తారు. అనంతరం ఇక్కడి ఓ కన్వెన్షన్‌ హాల్లో అమరవీరుల కుటుంబాలను, మేధావి వర్గాలను కలుస్తారు. ఉస్మానియా వర్శిటీ పర్యటనా ఉంటుంది. చివరగా గాంధీభవన్‌కు వచ్చి టీపీసీసీ కార్యవర్గం, పార్టీ సీనియర్‌నేతలతోనూ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్లిపోతారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube