టీ మీడియా, డిసెంబర్23,మధిర:
మధిర యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని వారిని సన్మార్గంలో నడిపించే దశలో క్రీడలు ఉపయోగపడతాయని, విద్యార్థులు చదువులో రాణిస్తూ క్రీడలో పాల్గొనాలని క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం అందిస్తాయని ప్రతి ఒక్కరూ క్రీడలో పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు బోడేపూడి భవన్ లో ఎస్.ఎఫ్.ఐ, డివైఎఫ్ఐ, మహిళా సంఘం, ఆధ్వర్యంలో ఆవుల గోపీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… సుందరయ్య మెమోరియల్ టోర్నమెంట్ పేరుతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ గ్రామాన సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని అన్నారు. ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీల తో పాటు తదితర క్రీడలు నిర్వహించాలని తెలిపారు.
మధిర లోని ప్రతి వార్డులో జనవరి 03 తేదీ నుండి 11 తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో గెలుపొందిన టీములు సుందరయ్య టోర్నమెంట్ ఆధ్వర్యంలో మధిర టౌన్ లో జనవరి 14,15 తేదీలలో మధిర మున్సిపాలిటీ స్థాయి లో నిర్వహించే పోటీలలో పాల్గొంటాయని తెలిపారు. అనంతరం చింతకాని మండలం లో డివిజన్ స్థాయిలో జనవరి 29,30, తారీకులలో నిర్వహించే పోటీలలో మధిర టౌన్ స్థాయిలో గెలిచిన ప్రధమ, ద్వితీయ, టీములు పాల్గొంటాయని తెలిపారు. ప్రతి ఒక టీము గెలుపు ఓటములను సమానంగా పంచుకోవాలని దేశ సమైక్యతకు సార్వభౌమత్వానికి క్రీడలు నిదర్శనమని తెలిపారు.
ఈ క్రీడలలో మధిర టౌన్ లోని ప్రతి ఒక క్రీడాకారులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాది నేని రమేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మద్దాల ప్రభాకర్ & బషీరుద్దీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వడ్రాణపు మధు, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు ఫణీంద్ర కుమారి, సీ.ఐ.టీ.యూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నర్సింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు పడకంటి మురళి, టీ యు డి ఫ్ జిల్లా నాయకులు ఫెంటి వెంకట్రావ్ రావు, ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ నాయకులు పేరు స్వామి, మస్తాన్, భరత్, గోపీ, ప్రదీప్, రవి, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
