వేసవి కాలంలో గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది..?

వేసవి కాలంలో గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది..?

0
TMedia (Telugu News) :

వేసవి కాలంలో గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది..?

లహరి, ఫిబ్రవరి 13, ఆరోగ్యం : ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ వేసవి కాలంలో ఎండలంలో మరింతగా మండిపోయే అవకాశం ఉండటంతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక గోరువెచ్చని నీరుతో ఎంతో ప్రయోజనం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయం అందరికి తెలియకపోవచ్చు. ఈ నీరు తాగాలని వైద్య నిపుణులు కూడా సిఫార్స్‌ చేస్తుంటారు. అయితే వేసవిని పరిగణలోకి తీసుకుంటే గోరువెచ్చని నీటితో దాహం తీర్చడం అసాధ్యం అనిపిస్తుంది. మలబద్దకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

రోజు గోరువెచ్చని నీటి తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు
☛ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. రక్తనాళాలకు విస్తరిస్తుంది. రక్తప్రసరణ మెరుగు పర్చేలా చేస్తుంది. ఇది కండరాలు నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అందుకే సాధారణంగా కండరాలు, లేదా కండరాల నొప్పి ఉంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. 2003లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనానికి ముందు 500 మి.లీ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ 30 శాతం మెరుగు పడుతుందని పరిశోధకులు గుర్తించారు.

☛ గోరువెచ్చని నీటి వల్ల సాధారణ ఫ్లూ, జలుబుతో పోరాడుతుంది. సైనస్‌ సమస్యలతో బాధపడేవారికి ఇది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

Also Read : ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో స్నేహం, శత్రుత్వం వద్దంటున్న చాణక్య..

 

☛ ఆయుర్వేదం ప్రకారం.. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరానికి చాలా రకాలుగా మేలు జరుగుతుందని బెంగళూరులోని బన్నెరఘట్ట రోడ్‌లోని ఫోర్టిస్‌ ఆస్పత్రి చీఫ్‌ డైటీషియన్‌ షాలినీ అవిరంద్‌ తెలిపారు. ఇది జీర్ణక్రియను మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. వేసవిలో ఈ గోరువెచ్చని నీరు తాగడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఏడాది పొడవున ఈ నీరు తాగే అలవాటున్న వారికి సులభంగా అనిపిస్తుంది.

☛ రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వలన బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వలన జీవక్రియ బలపడుతుంది. అంతేకాకుండా.. శరీరంలో కొవ్వును బర్న్ చేస్తుంది. రక్తప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో ఎక్కువగా సహయపడుతుంది. శరీరంలో టాక్సిన్.. కొవ్వు పేరుకుపోవడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగదు.. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం చాలా అవసరం.. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఫిట్‏గా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube