విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం

 సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం

1
TMedia (Telugu News) :

విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం

 

 సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం

 

టీ మీడియా,నవంబర్ 5, గోదావరిఖని :రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విద్యార్థులకు కులం, నివాసము,ఆదాయం ధ్రువపత్రాలను ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రామగుండం తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రామగుండం పారిశ్రామిక ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం.ఇక్కడ అధిక జనాభా కలిగిన ప్రాంతం. విద్యార్థులు ఎస్సై, కానిస్టేబుల్,ఇతర ఉన్నత చదువులు చదువుకోవడానికి స్కాలర్ షిప్,రియంబర్స్మెంట్ కోసం కులం,నివాసం,ఆదాయం, మరియు పుట్టిన తేదీ, క్లిమీలేయర్,నాన్ క్లిమిలేయర్,ఓబిసి, ధ్రువపత్రాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుంటే సకాలంలో ధ్రువపత్రాలు ఇవ్వకుండా విద్యార్థులను, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.జీవోలకు విరుద్ధంగా రామగుండం తహసిల్దార్ తన ఒంటెద్దు పోకడలతో లేనిపోని సాకులు చెప్పుతూ గతంలో ఏ తహసిల్దార్ చేయని ఇబ్బందులు ఈ తహసిల్దార్ చేస్తూ ధృవపత్రాలను రిజెక్ట్ చేస్తూ ప్రజలను ఆర్థికంగా నష్టపరుస్తున్న విధానాన్ని మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.తహసిల్దార్ కార్యాలయంలో ఏదైనా ధ్రువపత్రాలు కొరకు దరఖాస్తు చేసుకుంటే తహసిల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు పైరవీకారులను పెంచి పోషిస్తూ,సామాన్య ప్రజల ధ్రువపత్రాలను రిజెక్ట్ చేయడమే దీనికి నిదర్శనం అని ఆయన అన్నారు.

 

Also Read : కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి : సిఐటియు

 

ధ్రువపత్రాలను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న తహసిల్దార్ పై మరియు ధ్రువపత్రాలు జారీ చేసే అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు, సామాన్య ప్రజలకు సకాలంలో ధృవపత్రాలు అందే విధంగా జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో విద్యార్థులు,ప్రజలతో కలిసి రామగుండం తహసిల్దార్ కార్యాలయాన్ని ద్రిగ్బంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎలుక పెళ్లి సురేష్ ఉపాధ్యక్షులు మాతంగి సాగర్, నాయకులు ఆవునూరి అరవింద్,గాజుల వినయ్, గుడిసెల ప్రణీత్, కలికోట ప్రవీణ్,జయంత్ సిద్దు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube