దళిత బందు పేరిట డబ్బులు వసూలు చేస్తే తాటతీస్తా

ధరలు పెంచడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే

1
TMedia (Telugu News) :

దళిత బందు పేరిట డబ్బులు వసూలు చేస్తే తాటతీస్తా

ధరలు పెంచడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
టీ మీడియా, మార్చి26చింతకాని:దళిత బంధు పేరిట లబ్ధిదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసే దళారులు, బ్రోకర్లు, మోసగాళ్ల తాట తీస్తామని, వారి పై పోలీస్ కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గోడు వెళ్లబోసుకున్న ప్రజలు*
. భూమి, సొంత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇప్పించాలని మహిళలు వేడుకున్నారు. దొమ్మర కులస్తులను బీసీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం లోకి మార్చాలని ఆ కులస్తులు భట్టి ని కలిసి విజ్ఞప్తి చేశారు. డిగ్రీ పీజీ ఉన్నత చదువులు చదివిన తమ పిల్లలకు కొలువుల రాకపోవడంతో భవన నిర్మాణ కార్మికులుగా రోజు వారి కూలీ కి వెళ్తున్నారని మొరపెట్టుకున్నారు. రెండు కరెంటు బుగ్గలు వాడుకుంటున్న ఇళ్లకు నెలకు 2వేల బిల్లు వస్తే ఎలా కడతామని, చావాలా? బతకాలా? అంటూ దొమ్మర కులస్తుల మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన ఇండ్లు కూలి పోతున్నాయని తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని నరసింహాపురం దళిత మహిళలు తమ సమస్యలను విన్నవించారు. ప్రజల గొంతుక ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు పీపుల్స్ మార్చ్ ద్వారా ఒత్తిడి పెంచుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు.*
చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు.

Also Read : కూల్ ఫ్రీజర్ వాటర్ బాటిల్ వితరణ

కాంగ్రెస్ లో చేరికలు
మండలం మత్కేపల్లి గ్రామంలో కృష్ణా చి చి శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గ్రామాల్లో టిఆర్ఎస్, టిడిపి సి.పి.ఎం పార్టీలకు చెందిన నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్లో చేరిన వారిలో తిరుపతి పుల్లయ్య , పగడాల కోటేశ్వరరావు, గోదా పెద్ద మొగులాలు, తిరుపతి పుల్లయ్య నరేష్ తదితరులు ఉన్నారు.
తెలుగుదేశం నాయకుల సంఘీభావం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు చింతకాని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు శనివారం చింతకాని మండలం జగన్నాధపురం, చింతకాని, నరసింహ పురం గ్రామాల్లో సంఘీభావం ప్రకటించారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube