ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోం

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోం

టి మీడియా ,మార్చి 29 ,గోదావరిఖని :పారిశ్రామిక ప్రాంతంలోని సప్తగిరి కాలనీ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంగళవారం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు.గతంలో ఏఐఎస్ఎఫ్ తో పాటు పలు విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని. పేద,బడుగు,బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు డిగ్రీ కళాశాలను తరలిస్తే రాకపోకలకు ఇబ్బంది కలిగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 800 నుండి 1000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని , వారిని వదిలి పెట్టి మెడికల్ కళాశాలలోని 150 మంది విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తాననడం సిగ్గుచేటని ఆయన అన్నారు. డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా దూరం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని,లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి దశల వారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పసుల సాయి,కొమ్ము వంశీ,మొలుగురి నిహాల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : దుర్గగుడిలో మరో వివాదాస్పద ఘటన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube