కార్మిక చట్టాల జోలికొస్తే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం

మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

1
TMedia (Telugu News) :

కార్మిక చట్టాల జోలికొస్తే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం
-రెండో రోజు సార్వత్రిక సమ్మెలో మానవహారం
-మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా
టీ మీడియా, మార్చి30,ఖమ్మం: జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె రెండవ రోజు జరిగింది. ఉదయం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సంపూర్ణంగా రెండోరోజు సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి మానవహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బిజీ క్లైమెట్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జి రామయ్య, టిఆర్ఎస్కెవి జిల్లా నాయకులు పాల్వంచ కృష్ణ, మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కేంద్ర కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 28 29 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు ,ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేశారని వారు తెలిపారు.

Also Read : సింగరేణి సంస్థను పైవేటిపరం చేసేందుకు కేంద్రం కుట్రలు…

కేంద్ర ప్రభుత్వం గత 150 సంవత్సరాలకు పూర్వం భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి,కార్పోరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వాటిని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తున్న దివాలా కోరు విధానాలకు ప్రదాని మెూడి స్వస్తి పలకాలని వారు డిమాండ్ లేనియెడల కార్మికుల తో పెట్టురా ఏ ప్రభుత్వాలకు మనుగడ లేదని రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వాన్ని కూడా కార్మికులు తగిన బుద్ధి చెబుతారని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఏఐ టి యుసి జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ, ఐ ఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు నరేష్ మోహన్, టిఆర్ఎస్కెవి నాయకులు పాష నాయకులు వివిధ సంఘాల నాయకులు ఏం గోపాల్,పి.రమ్య ,ఏ.రామారావు ముద్దం శ్రీనివాస్,తిరుమల చారి, కే. శ్రీనివాస్ లతో పాటు ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube