పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం

బాబు మాటలు నమ్మోద్దు.. ఆయనది మోసం.. వెన్నుపోటే

0
TMedia (Telugu News) :

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం

– బాబు మాటలు నమ్మోద్దు.. ఆయనది మోసం.. వెన్నుపోటే

– సీఎం జగన్

టీ మీడియా, నవంబర్ 15, పల్నాడు : తన పద్నాలుగు ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఒక్క మంచి పని చేశారా? మోసం వెన్నుపోట్లతో మళ్ళీ అధికారం కావాలని కోరుతున్నాడుని, త్వరలో మహా సంగ్రామం జరగబోతోందని, ప్రజలు ఒక్కసారి ఆలోచించి..,, మంచి చేసిన ఈ బిడ్డ కావాలా? నమ్మక ద్రోహం చేసే బాబు కావాలో ? నిర్ణయం తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 100 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే వరికపూడి సెల ఎత్తిపోతల పథకానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.349.26 కోట్లతో పల్నాడు ప్రజల చిరకాల కలను సాకారం చేసే వరికపూడి సెల ఎత్తిపోతల నిర్మాణానికి మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంట, వజ్రాలపాడు తండాల మధ్య శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. 1,20,000 ఎకరాలకు సాగునీరు, నూరు గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేక పోయినా ఎన్నికలకు నెల రోజుల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చి టెంకాయ కొట్టారని, కానీ తమ ప్రభుత్వం అటవీశాఖ, అభయారణ్యంలో ఉన్న కారణంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సంస్థ అనుమతులు, పర్యావరణ శాఖ అనుమతులు వచ్చిన తరువాతే ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ వివరించారు.

Also Read : బామ్నోలి భూసేకరణ అక్రమాలపై నివేదికను పంపిన కేజ్రీవాల్‌

అప్పటి ప్రభుత్వం టెంకాయ కొట్టిన సమయంలో భూ సేకరణ జరగలేదు, పర్యావరణ శాఖ అనుమతులు లేవు. కేవలం జనాన్ని మోసగించటానికి, అమ్మలను మోసగించటానికి , విద్యార్థులను మోసగించటానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని సీఎం జగన్ అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో తాగునీరు ఇవ్వలేని నాయకుడు , కనీసం కుప్పాన్ని డివిజన్గా మార్చలేని నాయకుడు మరో సారి అధికారం ఇవ్వాలని కోరుతున్నారని చంద్రబాబు నాయుడును సీఎం జగన్ ఎద్దెవ చేశారు. త్వరలో మహా సంగ్రామం జరగబోతోందని, మోసం చేసేందుకు, వెన్నుపోట్లు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధ పడుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. పేదల సాధికారిత కోసం కృషి చేస్తున్నామని, 53 నెలల్లో 2.4 లక్షల కోట్లుపేద కుటుంబాలకు చెందిన అక్కా చెల్లెమ్మలక శాతాలకు చేరాయని, ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఇళ్ల స్థలాలు, సంపూర్ణ డీబీటీ, నాన్ డీబీటీ రూ. 1.40 లక్షల కోట్లు వెరశి రూ.4.10 లక్షల కోట్లుతో మంచి చేశాం. కరువు పరిస్థితిలోనూ సంక్షేమ పథకాల్లో వెనుకంజ వేయలేదన్నారు. పేదలు, మహిళల కోసం ఒక్క సంక్షేమ పథకాన్నీ చంద్రబాబు అమలు చేయలేదన్నారు. పౌరుషాల గడ్డ పల్నాడును అభివృద్ధి గడ్డగా మారుస్తామన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, మహిళలకు సాధికారితను సమకూర్చుతున్నామన్నారు. గతం గుర్తు చేసుకొంటే, వరుసగా రెండేళ్లు కోవిడ్ వచ్చినా, ఖర్చులు పెరిగినా, అప్పులు పెరిగినా సాకులు చెప్పలేదు, కష్టకాంలో సంక్షేమం ఆపలేదు. అభివృద్ధి ఆపలేదు. రాబోయే మహాసంగ్రామంలో అందరు ఆలోచన పెంచాలి. మంచి జరుగుద్దా లేదా బేరీజు వేయాలి. గత పాలనో 14 ఏళ్లు సీఎంగా ఉన్నా చంద్రబాబు మంచి చేశానని, మంచి స్కీమ్ చేశానని చెప్పడు. ఎన్నికల్లో మాత్రం అది చేస్తా, ఇది చేస్తా అని చంద్రబాబు మోసం చేస్తాడు.

Also Read : అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఇసుక లారీ : వ్యక్తి మృతి

కేజీ బంగారం ఇస్తా, బెంజికారు ఇస్తా అని ఓట్లు అడుగుతున్నారు అని సీఎం జగన్ విమర్శించారు. మాచర్లకు, పల్నాడుకు మంచి నీరు ఇస్తానని నమ్మ బలికితే నమ్ముతామా? అని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తానన్నట్టు చంద్రబాబు మోసం చేస్తారని సీఎం జగన్ అన్నారు. పొదుపు సంఘాల రుణాల మాఫీ చేస్తానని హామీ బాబు ఇచ్చాడు, అక్క చెల్లెమ్మలను అప్పు పాలు చేసిన ఈ బాబు ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, 30 లక్షల ఇళ్ల స్థలాకు పట్టాలు ఇచ్చాడా? ఆయన చేస్తానంటే నమ్మగలమా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube