అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము

సిపిఎం

1
TMedia (Telugu News) :

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము

– సిపిఎం

టి మీడియా, డిసెంబర్ 7, గోదావరిఖని : జగిత్యాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ,ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలను ఇండ్లలోకి వెళ్లి ముందస్తుగా అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.యాకయ్య అన్నారు.ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఎక్కడున్నాము అని ప్రశ్నించారు.జగిత్యాల జిల్లా కు ముఖ్యమంత్రి వస్తే పెద్దపల్లి లో అరెస్టులు చేయడం ఏంటని అన్నారు.

Also Read : ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

నిజంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లైతే రాష్ట్రంలో నిరసనలు ఎందుకుంటాయని అన్నారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే భయంతో జిల్లాలో అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు.అరెస్టు చేసినవారికి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube