అవమానించడం తీవ్రంగా ఖండిస్తున్నాం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 19 వనపర్తి : ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ రాజీవ్గాంధీ, వాజ్ ఫెయి, పీవీ సింధు, అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ వంటి దిగ్గజాలతో ఎన్నో దేశ రాష్ట్ర సంక్షోభాలను పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబును అవమానించిన జగన్ తన రాజకీయ పతనానికి పునాది వేసుకున్నారు. వ్యక్తిగతంగా కుటుంబంలోని భార్యను కూడా అవమానించాలని తీవ్రంగా ఖండిస్తున్నామని వనపర్తి పట్టణ టిడిపి అధ్యక్షులు నందిమల్ల అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు జగన్ కుట్ర వేశారు. తాత్కాలికంగా ఆనందాన్ని పొందుతున్న జగన్మోహన్రెడ్డికి ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆంధ్రను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాళా తీయించి వాటిని కప్పిపుచ్చుకునేందుకే వ్యక్తిగత దూషణలు దిగుతున్నాడు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి రోజు ఇప్పటికైనా జగన్ క్షమాపణలు చెప్పి ప్రతిపక్ష విలువలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube