ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున ఉద్యమిస్తాం

ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున ఉద్యమిస్తాం

TMedia (Telugu News) :

ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున ఉద్యమిస్తాం

– ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి

టీ మీడియా, జనవరి 5, సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమనడం కాంగ్రెస్‌ కు సబబు కాదని, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీ నేతల తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి ఉద్దేశంలో ఉందని ఆరోపించారు. తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందన్నారు. వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పరిపాలనపై ప్రజల్లో చర్చ మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. పథకాల అమలుకు ప్రభుత్వంగా సమయం తీసుకుంటే తప్పులేదు కానీ, ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు.

Also Read : జపాన్‌లో 92కి చేరిన భూకంప మృతుల సంఖ్య

తెలిసీ, తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలా మారాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420 ఉన్నాయన్న ఆయన ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. పరిపాలన చేతకాకపోతే అనుభవజ్ఞుల సహాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube