పార్లమెంటుపై డిసెంబర్ 13 లోగా దాడి చేస్తాం

పార్లమెంటుపై డిసెంబర్ 13 లోగా దాడి చేస్తాం

0
TMedia (Telugu News) :

పార్లమెంటుపై డిసెంబర్ 13 లోగా దాడి చేస్తాం

– గురుపత్వంత్ సింగ్

టీ మీడియా, డిసెంబర్ 6, హైదరాబాద్ : ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌, ఎస్ఎఫ్‌జే సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్‌ తాజాగా మరోసారి బెదిరిం పులకు పాల్పడ్డాడు. ఈనెల 13 లేదా ఒక్కరోజు ముందు రోజైనా పార్ల మెంట్‌పై దాడి చేస్తామని హెచ్చరించాడు ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ వీడియోకి ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్‌,ఢిల్లీ ఖలిస్థాన్‌గా మారబోతోంది, అనే శీర్షికతో వీడియో రిలీజ్‌ చేశాడు. ఈనెల 13వ తేదీ లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్‌ దాడి దోషి అఫ్జల్‌ గురు పోస్టర్‌ను కూడా అందులో ప్రదర్శిం చాడు. ఈ వీడియోలో తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని అన్నారు. కాగా, డిసెంబర్‌ 13వ తేదీకి పార్లమెంట్‌ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు నిండనుంది. 2001 డిసెంబర్ 13వ తేదీ రోజు ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసా గనున్నాయి.

Also Read : 100 అక్ర‌మ వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేసిన కేంద్రం

సమావేశాలు జరుగుతన్న వేళ ఇలా ఖలిస్థాన్‌ ఉగ్రవాది నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పన్నూన్‌ బెదిరింపుల వీడియో బయటకు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పార్లమెంట్‌ పరిసరాల్లో సెక్యూరిటీని మరింత టైట్ చేశాయి. అన్ని వాహ నాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే సమ యంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube