తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం

తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం

0
TMedia (Telugu News) :

తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం

– అసదుద్దీన్‌ ఒవైసీ

టీ మీడియా, నవంబర్ 3, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. తాజాగా ఆరు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ నుంచి కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు.చంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ, నాంపల్లి నుంచి మాజిద్‌ హుస్సేన్‌, చార్మినార్‌ నుంచి మాజీ మేయర్‌ జుల్ఫికర్‌, యాకుత్పురా నుంచి జాఫర్‌ హుస్సేన్‌ మిరాజ్‌, మలక్‌పేట నుంచి అహ్మద్‌ బలాల, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మొయినుద్దీన్‌ బరిలోకి దిగుతారని తెలిపారు.

Also Read :కేసుల వాయిదాపై సీజేఐ సీరియ‌స్‌

బహదూర్‌పురా, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటిస్తామని, ఒకట్రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎంఐఎం ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube