పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తాం.
పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తాం.
పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తాం.
బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి అల్లిక వెంకటేశ్వరరావు.
టీమడియా ,ఆగస్టు 6 ,తిరుమలయాపాలెం:ప్రజలను డైలామాల పడేస్తూ మూడవసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ చూస్తుండు.రాబోయే ఎన్నికల్లో పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి,పాలేరు ఇంచార్జ్ అల్లిక వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి స్టేజి వద్ద ఏర్పాటు చేసిన పత్రిక విలేకర్ల సమావేశంలో అల్లిక మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం నాడు బహుజనులు అమరు లై నీలి జెండాను రెపరెపలాడించిన వీరులు ఎంతో మంది ఉన్నారని అన్నారు.
also read:పవర్ (మేక్) న మజాకా
నీలి జెండా రాకతోనే అన్నికులాల,మతాలవారికిన్యాయంజరుగుతుందన్నారు.జనాభా నిష్పత్తి ప్రకారం బహుజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.నీలి జెండా అమ్ముడుపోని మడమతిప్పని త్యాగనిరతి గల పార్టీ అని తెలిపారు.రాబోయే రోజుల్లో పాలేరు గడ్డ పై నీలి కండువా ఎగరవేయడం ఖాయమన్నారు.బిసి, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి రాబోయే రోజుల్లో దొరల గడీలను కూల్చడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పాలకులు దోచుకున్న వేలకోట్ల డబ్బులను గల్లా పట్టి తీసుకొస్తామన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి మొదటి సారి అధికారంలోకి, రెండవ సారి ఉచిత పథకాల పేరిట మభ్యపెట్టి,మూడవ సారి ప్రజలను డైలమాల పడేస్తూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని కానీ రాబోయే ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీలే భవిష్యత్తు పాలకులవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోఖమ్మం జిల్లా ఇంచార్జి డాక్టర్ పిసి వీరస్వామి,అసెంబ్లీ అధ్యక్షుడు ఎన్నేబోయిన రమేష్, తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు బిక్కు నాయక్, మండల కార్యదర్శి ఏ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.