గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం

గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం

0
TMedia (Telugu News) :

గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం

– సీఎం జగన్‌

టీ మీడియా, డిసెంబర్ 26, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో సీఎం జగన్‌ క్రీడా పోటీలను ప్రారంభించారు. బ్యాడ్మింటిన్‌ ప్లేయర్‌ కిందాంబి శ్రీకాంత్‌ కలిసి సిఎం జగన్‌ క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం జరిగిన సభలో సిఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. గ్రామాల్లో ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తీసుకు వచ్చామనిజ. దేశానికి ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామన్నారు. క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు పెంచేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందని..బ్యాడ్మింటిన్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ వంటి వారి సహకారంతో గ్రామీణ స్థాయిలో కోచింగ్‌ ఇప్పిస్తామని తెలిపారు. ఈ పోటీల కోసం 9వేల ప్లే గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. 47 రోజులు, ఐదు దశల్లో పోటీల నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read : జెడియు జాతీయ అధ్యక్ష పదవికి లలన్‌ సింగ్‌ రాజీనామా.!

క్రీడా సంబురాలు ఇకపై ప్రతీ ఏడాది జరుగుతాయని తెలిపారు. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఎం జగన్‌.. క్రికెట్‌ కిట్స్‌, వాలీబాల్‌ కిట్‌, బ్యాడ్మింటన్‌ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజా క్రికెట్‌ ఆడి క్రీడాకారులను ఉత్సహపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మెరుగ నాగార్జున, విడదల రజనీ, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, ముస్తఫా, ఎం.ఎల్‌.సి.లు లెళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, జంగా కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube