అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం

0
TMedia (Telugu News) :

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం

– ప్రియాంక గాంధీ

టీ మీడియా, నవంబర్ 24, పాలకుర్తి : తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గని ప్రసంగించారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు.”తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివఅద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో.. ప్రజలు ఆలోచించాలి. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి.

Also Read : ఆర్మూర్ సభలో కేసీఆర్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ అమిత్ షా

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. పేపర్‌ లీకేజీలను అరికడతాం.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్‌ రావాలి. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గరపడింది” అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube