అంగన్వాడి సమస్యలను పరిష్కరిస్తాం

- నారా చంద్రబాబు నాయుడు

0
TMedia (Telugu News) :

అంగన్వాడి సమస్యలను పరిష్కరిస్తాం

– నారా చంద్రబాబు నాయుడు

టీ మీడియా, డిసెంబర్ 29, తిరుపతి : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయమైన అంగన్వాడి సమస్యలు పరిష్కరిస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పం పర్యటలో భాగంగా శుక్రవారం ఆయన అంగన్వాడి దీక్ష శిబిరం కి వచ్చి సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీలకు ఎప్పుడూ న్యాయం చేసిన ప్రభుత్వం టిడిపినే అన్నారు. 4,500 నుంచి 10000 రూపాయల వరకు జీతం పెంచిన ఘనత టిడిపికే దక్కుతుందని అన్నారు.. అంగన్వాడీలు వర్కర్లు చేస్తున్న సమ్మె న్యాయ సమ్మతమైంది అన్నారు.. జగన్‌ను చూసి అంగన్వాడి తల్లులు మోసపోయారని విమర్శించారు. మీరు చేస్తున్న పోరాటం న్యాయమైందని చెప్పారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సమస్యలన్నీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. అంగన్వాడి మహిళలు ఇచ్చిన విజ్ఞాపత్రాన్ని స్వీకరించారు..

Also Read : మోడల్ మార్కెట్ ఖమ్మం ఏ ఏం సి

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube