ఫాక్స్‌కాన్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందిస్తాం

ఫాక్స్‌కాన్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందిస్తాం

0
TMedia (Telugu News) :

ఫాక్స్‌కాన్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందిస్తాం

– సీఎం రేవంత్ రెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 26, హైద‌రాబాద్ : ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ‌లో చేప‌ట్ట‌బోయే భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కొంగ‌ర‌క‌లాన్ ఉత్పాద‌క కేంద్రానికి కూడా స‌హ‌కారం అందిస్తామని పేర్కొన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ‌ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్రతినిధుల బృందం మంగ‌ళ‌వారం క‌లిశారు. ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్‌ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్దిని మరింత వేగవంతం చేస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు.

Also Read : కొవిడ్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రమాదకరం కాదు.. ఆందోళన వద్దు

2023, డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్సాకాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ ప్ర‌ధానంగా ఆపిల్ ఐఫోన్ల‌ను త‌యారు చేస్తుంది. ఫాక్స్‌కాన్‌ ప్రధాన కస్టమర్లలో గూగుల్, జియోమి, అమెజాన్, అలీబాబా గ్రూప్, సీస్కో, డెల్, ఫేస్‌బుక్‌, సోని, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి సంస్థ‌లు ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25000 ఉద్యోగాలు కల్పించనున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube