ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్ ప్రాసిక్యూషన్ పై వెబినార్

0
TMedia (Telugu News) :

టీ మీడియా
కొడిమ్యాల నవంబర్ 17
జెయన్టియు ఇంజనీరింగ్ కళాశాల నాచుపల్లి లో అన్ని విభాగాల విద్యార్థులకు ఒక రోజు వెబినార్ బుధవారం నిర్వహిచడం జరిగింది. దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ ప్రొ॥ వి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా విద్యార్థులకు దోహదపడుతుందో వివరించారు. రిసోర్స్ పర్సన్ డా॥ రాజేష్ కులకర్ణి ఐపిఆర్ అండ్ పిపి గురించి విఫులంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొ॥ టి.వేణుగోపాల్ ఐపిఆర్ సెల్ కోఆర్డినేటర్ ప్రొ|| యం.ధనలక్ష్మీ , రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ కోఆర్డినేటర్ డా॥బి. క్రాంతి కిరణ్ మరియు వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Webinar on Intellectual Property Rights
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube