పినపాకలో పొంగులేటికి ఘన స్వాగతం

పలువురికి ఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

పినపాకలో పొంగులేటికి ఘన స్వాగతం

–  పలకరింపులు, పరామర్శలతో సాగిన పర్యటన
– పలువురికి ఆర్థిక సహాయం
టీ మీడియా,సెప్టెంబర్ 19,పినపాక: మాజి ఎంపిపొంగులేటికి పినపాకలో ఘన స్వాగతం లభించింది .కొంతమంది ప్రకటన చేసినట్లుఎవరు అడ్డు కోలేదు. ద్విచక్రవాహనాల ర్యాలీని నిర్వహించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన పలకరింపులు… పరామర్శలతో కొనసాగింది. పర్యటనలో భాగంగా పినపాక మండలంలోని దుగినేపల్లి, చెగర్మల, ముకుందాపురం, భూపతిరావుపేట, జానంపేట, విప్పలగుంపు, దేవనగరం, సింగిరెడ్డిపల్లి, మద్దులగూడెం, వెంకట్రావు పేట, చింతల బయ్యారం, పాతరెడ్డిపాలెం, బయ్యారం, మల్లారం, రాజుపేట, గడ్డిగూడెం, పొట్లపల్లి, గడ్డంపల్లి, సీతంపేట, రావిశెట్టిగూడెం, ఉప్పాక గ్రామాలను, మణుగూరు మండలంలోని రామానుజవరం, విప్పల సింగారం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో జరిగిన శుభ, అశుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్థికసాయాలను అందజేసి పలు కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ప్రజల ఆదరాభిమానాలే తనకు శాశ్వతం అని మరోమారు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, తెరాస రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు,అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube