కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
టీ మీడియా, అక్టోబర్ 11, వనపర్తి బ్యూరో : వనపర్తి బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో వనపర్తి మండల రైతు బందు అధ్యక్షుడు దేవర్ల నరసింహ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల బాలకృష్ణ ఆధ్వర్యంలో శ్రీనివాసపురం కు చెందిన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ తోనే అభివృద్ది,కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష, ప్రతి గడపకూ వెళ్లాలి ప్రతి మనిషిని కలవాలి,ప్రభుత్వ పథకాలను వివరించి ప్రజల మద్దతు అభ్యర్థించాలి.
Also Read : జనంలోకి జనసేన.. ఇంటింటికీ జనసేన కార్యక్రమం
ఉచిత చేపపిల్లలు, సబ్సిడీ గొర్రెల పథకాలతో గొల్ల, కురుమలు, మత్స్యకారుల కుటుంబాలకు అసరా
పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు సామాన్య మధ్యతరగతి ప్రజలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడి ఆర్థికంగా బలపడాలన్నది కేసీఆర్ ఆకాంక్ష .పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రతి ఓటరునూ కోరాలి అన్నారు.