ఆరోగ్య సంరక్షణకు తీసుకున్న చర్యలేమిటీ

లోక్ సభలో కేంద్రానికి ఎంపీ నామ లిఖిత పూర్వక ప్రశ్న

1
TMedia (Telugu News) :

ఆరోగ్య సంరక్షణకు తీసుకున్న చర్యలేమిటీ ?
– నిధుల కేటాయింపు గురించి చెప్పండి
– లోక్ సభలో కేంద్రానికి ఎంపీ నామ లిఖిత పూర్వక ప్రశ్న

టి మీడియా ,జూలై 29,ఢిల్లీ : సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు లోక్ సభలో కేంద్రాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు . ఇందుకు సంబంధించి గత అయిదేళ్లలో రాష్ట్రాలకు , కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలను కూడా తెలియజేయాలని కోరారు . నామ ప్రశ్నపై కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ మన్సూల్ మాండవ్య సమాధానం ఇస్తూ ఆరోగ్య ఉపకేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసేందుకు దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు . ఈ కార్యక్రమం కింద మాతాశిశు ఆరోగ్య సేవలతో పాటు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు చికిత్స , ఉచితంగా అవసరమైన మందులను అందజేయడం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా రాష్ట్రాల మద్దతుతో 1.5 లక్షల ఉపకేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెన్ కేంద్రాలుగా మార్చడం జరిగిందన్నారు . జూన్ 30 ,2022 నాటికి దేశంలో మొత్తం 1,20,112 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పని చేస్తున్నాయని అన్నారు . ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక , ఆర్థిక సాయాన్ని కేంద్రం అందజేస్తుందని తెలిపారు . తెలంగాణలో 4067 , గుజరాత్ 7647 , ఆంధ్రప్రదేశ్ 9106 , మహారాష్ట్రలో 10514 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు.

 

Also Read : బహుజన్ సమాజ్ పార్టీలో భారీ చేరికలు

 

చిన్న పట్టణాల అభివృద్ధికి ప్రణాళికేమైనా ఉందా ?

దేశంలో చిన్న పట్టణాలు , బ్లాక్ , మండల ప్రధాన కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా ? ఉంటే నిధులు కేటాయింపు వివరాలు , లేకుంటే అందుకు గల కారణాలను తెలియజేయాలని టీఆర్ఎన్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్ సభలో కేంద్రాన్ని లిలితపూర్వకంగా ప్రశ్నించారు . నామ ప్రశ్నకు కేంద్ర గృహ , పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ కేంద్రం తన మిషన్ ద్వారా రాష్ట్రాలకు , కేంద్ర పాలిత ప్రాంతాలకు పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందజేస్తుందని . తెలిపారు . వివిధ మిషన్ల ద్వారా చిన్న పట్టణాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు . అమృత్ 2.0 మిషన్ ను అక్టోబర్ 1 : 2021 న అయిదేళ్ల కాల పరిమితితో ప్రారంభించడం జరిగిందన్నారు . ఇందుకు గాను 2021 – 22 నుంచి 2025-26 నాటికి రూ .72.77,000 కోట్ల అంచనాలతో ఈ పధకాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube