“ఏపీవై ” పధకం సంగతేమిటీ.?

- నిధుల వివరాలు వెల్లడించండి

0
TMedia (Telugu News) :

“ఏపీవై ” పధకం సంగతేమిటీ.?

– నిధుల వివరాలు వెల్లడించండి
– మంత్రి సమాధానంపై ఎంపీ నామ తీవ్ర అసంతృప్తి

టీ మీడియా, డిసెంబర్ 19, న్యూఢిల్లీ : అటల్ పెన్షన్ యోజన పధకం ( ఏపీవై ) అమలులో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించడం పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన సోమవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకానికి నిధులు ఏ మేరకు సమకూరుస్తుందో, లేదో తెలియజేయాలని రాష్ట్రాల వారీగా ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, సమగ్ర సమాచారం తెలియజేయాలని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ పథకానికి కేటాయించిన నిధుల వివరాలను రాష్ట్రాల వారీగా వెల్లడించాలన్నారు. పథకం కింద కనీస పెన్షన్‌ను పెంచడానికి, ఎక్కువ మంది సభ్యులు చేరి, ప్రయోజనం పొందేలా ప్రోత్సహించడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా? అని ఎంపీ నామ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే 2021 – 2022 – 2023 లలో పథకానికి ప్రభుత్వ కో కంట్రిబ్యూషన్ నిధులు కేటాయించలేదన్నారు. అలాగే పెన్షన్ ఆస్తుల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఉద్దేశించిన గ్యాప్ ఫండ్ కు కూడా నిధులు కేటాయింపు చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందని నామ అన్నారు. పెన్షన్ సబ్ స్క్రిప్షన్ మొత్తాన్ని పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని అడిగారు.

Also Read : ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం

రాష్ట్రాల వారీగా పధకం వివరాలు ఇవ్వకపోవడం పట్ల ఎంపీ నామ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు ఎంచుకున్న ఆధారంగా కనీస హామీ పెన్షన్ ను అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరద్ ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. పథకానికి సంబంధించిన కో కంట్రిబ్యూషన్ నిధులు, బ్యాంకులకు ప్రోత్సహాక చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. వేరే చట్టబద్ద సామాజిక భద్రతా పధకంలో సభ్యులు కాని వారిని, ఆదాయపు పన్ను కట్టని అర్హత ఉన్న వారిని ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube