క్రిమినల్ ను సమర్ధించడం మేన వైసీపీ లక్ష్యంమా

క్రిమినల్ ను సమర్ధించడం మేన వైసీపీ లక్ష్యంమా

1
TMedia (Telugu News) :

క్రిమినల్ ను సమర్ధించడం మేన వైసీపీ లక్ష్యంమా
-బిజెపి సూటి ప్రశ్న

చింతూరు, మే 26. టీ మీడియా:

దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత బాబు తానే స్వయంగా వాంగ్మూలం ఇచ్చినప్పటికీ చింతూరు వైసిపి నాయకులు వెనకేసుకుని వస్తూ అతని అడుగు జాడల్లోనే నడుస్తామని చెప్పడం చాలా దుర్మార్గంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకయ్య, మీడియం రమణ, డి వి ఎస్ ఎన్ రమణారెడ్డి బుధవారం ఒక పత్రికా ప్రకటనలో విమర్శించారు. కొంతమంది ఎస్టి కులం పేరుతో మండలంలో గిరిజనులను మోసం చేస్తున్నారని అటువంటి వారే ఎస్టి ద్రోహి అయినా అనంత బాబు భజన చేస్తున్నారని అన్నారు. అనంత బాబు తప్పుని ఎత్తి చూపిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని వైసిపి నాయకులు మాట్లాడడం మానకపోతే అనంత బాబు భజన చేసేవారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. వైసీపీ నాయకులు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇంకొంతమంది వాడుకుంటున్నారని దీనిపై వైసీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలనిబిజెపినాయకులు హితవు పలికారు.

Also Read:రాజ్య‌స‌భ టీఆర్ఎస్ స‌భ్యుడిగా గాయ‌త్రి ర‌వి ఏక‌గ్రీవ‌ ఎన్నిక‌

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube