వాట్సాప్‌లో పరిచయం.
– రూ.7 లక్షలు కాజేసిన యువతి
టి మీడియా,జూలై 13,హిమాయత్‌నగర్: వాట్సాప్‌లో పరిచయమైన అమ్మాయి మాటలు నమ్మిన ఓ యువకుడు రూ.లక్షల్లో మోసపోయి పోలీసులకు ఆశ్రయించాడు. ఓల్డ్ మలక్ పేటకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ యువతి వాట్సాప్‌లో పరిచయమైంది. కొన్ని రోజులు మాట్లాడుకుని ఒకరికొకరు ఇష్టపడ్డారు. తాను యాప్స్‌లలో పెట్టుబడులు పెట్టి లక్షలు సంపాదిస్తున్నానని నువ్వు కూడా పెట్టుబడులు పెట్టాలని కోరింది.
Also Read : వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంధాల్లో ఐన్ స్టీన్ సిద్ధాంతం : టీటీడీ ఈవో
‘బీపీఎం 2021’ అనే యాప్‌లో ముందుగా రూ.50 వేలు పెట్టగా రూ.30 వేలు, రూ.2 లక్షలు పెట్టించి రూ.80 వేలు లాభాలు వచ్చేలా చేసింది. ఆ తర్వాత రూ.7 లక్షలు పెట్టించి లాభాలు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube