వికలాంగునికి వీల్ చైర్ అందజేత

వికలాంగునికి వీల్ చైర్ అందజేత

0
TMedia (Telugu News) :

వికలాంగునికి వీల్ చైర్ అందజేత

టీ మీడియా,ఏప్రిల్ 14 గోదావరిఖని :

అమ్మ పరివార్ స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని విట్టల్ నగర్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన మల్లారపు పోచమల్లు అనే వికలాంగునికి వీల్ చైర్ ని పెద్దపెల్లి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ బి.శ్రీధర్, పెద్దపెల్లి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కమలాకర్ చేతులమీదుగా బుధవారం వారికి అందజేయడం జరిగింది.అలాగే వారి పోషణార్థం 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు నిత్యావసర సరుకులు,పౌష్టికాహారం కోసం పండ్లను అందజేయడం జరిగింది.కార్యక్రమ నిర్వాహకులు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ మంద నాగరాజు మాట్లాడుతూ…
కొన్ని రోజులుగా కాలు విరిగిపోయి ఒకే కాలు,అది నీకు అది కూడా విరగడంతో ఇంట్లోనే ఉంటూ ఎటు వెళ్లలేని స్థితిలో మానసిక బాధ కి లోనవుతున్నట్లు బాధను అమ్మపరివార్ స్వచ్చంధ సేవ సంస్థ నిర్వాహకులు నాగరాజు తో తెలపడంతో ఆయన వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా శైలు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ పి.జితేందర్, కనకరాజు,పెద్దపెల్లి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఐలయ్య,శ్యామ్, సుమలత,అమ్మ పరివార్ సంస్థ సభ్యులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

 

Also Read;అనాధ బాలిక పట్ల పోలీసుల ఔదార్యం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube