శ్వేతదళం స్వచ్చంద సేవా సంస్థను స్థాపించిన పొలీస్ కానిస్టేబుల్ చేలే రామారావు ఆపదలో ఉన్న శ్రీకాంత్ కు రూ 5000లు

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 21, వెంకటాపురం :

మానవత్వం మచ్చుకైనా కనిపించని నేటి ఆధునిక సమాజంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బర్లగూడెంలో ఉద్యోగస్తులు నేనున్నా అని ముందుకు వచ్చిన కానిస్టేబుల్ చేలే రామారావుని అభినందించారు. ఆదివారం చిరుతపల్లిలోని పాఠశాల ఆవరణలో శ్వేతదళం స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభోత్సవ కార్యాక్రమం నిర్వహించారు. భద్రాచలంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న చేలే రామారావు స్వచ్చంద సేవా సంస్థను స్థాపించడం పంచాయతీ ప్రజలందరికీ గర్వకారణమని సర్పంచ్ కొర్శా నర్సింహమూర్తి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సర్పంచ్ కొర్శా నరసింహమూర్తి, ఎంపీటీసీ సమ్మక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ నర్సింహమూర్తి కేక్ కట్ చేసి సంస్థ వ్యవస్థాపకులు చేలే రామారావు తినిపించడం జరిగింది.సంస్థ వ్యవస్థాపకులు చేలే రామారావు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మాత్రమే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిలో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు లేవని అన్నారు. నిస్వార్ధం తో సేవ చేయడం నా ఉద్దేశం అన్నారు. గ్రామాల్లో యువత మద్యం మత్తు లో ఊగిసలాడుతోందని అన్నారు.

గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కొరకు నడుంబిగించాలని తెలియజేశారు. శ్వేతదళం సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పడిందన్నారు.యువత ఆదర్శ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారికి సహాయపడాలని సహాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉంది అన్నారు. ఆదివాసీ న్యాయ వాది చింత సమ్మయ్య మాట్లాడుతూ రామారావు లాగా ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచించాలని అప్పుడే ఈ సమాజానికి మేలు జరుగుతుంది అని అన్నారు. శ్వేతదళం ముందుకు పోవడానికి అందరి సహకారం అవసరం అని కానిస్టేబుల్ చింత సర్వేశ్వర్ రావు అన్నారు. ప్రమాదంలో వెన్నెముక విరిగి రెండు కాళ్ళు చచ్చు పడిపోయి మంచానికి పరిమితం అయిన బొల్లారం గ్రామానికి చెందిన శ్యామల శ్రీకాంత్ కి శ్వేతదళం స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చేలే రామారావు 5 వేల రూపాయలు సర్పంచ్ నర్సింహమూర్తి చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో చేలే రామారావు కానిస్టేబుల్, చింత సర్వేశ్వర రావు కానిస్టేబుల్ , బర్లగుడెం సర్పంచ్ కోర్శ నరసింహ మూర్తీ, ఎంపీటీసీ , కుర్సం సమ్మక్క,చింత సమ్మయ్య , వాసం నాగరాజు , కుచ్చింటి చిరంజీవి, పాయం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Police Constable Chele Rama Rao, founder of the White Army Service organization Rs 5,000 to Srikanth who is in distress. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube