జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి

జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి

0
TMedia (Telugu News) :

జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి

టీ మీడియా, జనవరి 18, మహబూబాబాద్ : దళిత జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన సంఘీభావం తెలిపిన దళిత గిరిజన ప్రజాసంఘాలు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు నివారించి అందుకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత జర్నలిస్టు యూనియన్ మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు, బీఎస్పీ, ఎంఆర్పీఎస్, మాలమహానాడు, కేవిపీఎస్, అంబేద్కర్ యువజన సంఘం, ఎల్ హెచ్ పీఎస్, పలు విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అందుకు బాధ్యులైన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిజాలను నిర్భయంగా వెల్లడించడంలో దళిత జర్నలిస్టులు ముందుంటారన్నారు. ఇటీవలికాలంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారిణి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించే ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వారిపై కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలోని దళిత జర్నలిస్టు లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గొర్రె చిట్టిబాబు, తేజావత్ రవి, కట్కూరి ప్రసాద్, యిరుకుల్ల కిరణ్, చందా శ్రీనివాస్, దుర్మారపు శ్రీనివాస్, గుగ్గిళ్ళ పీరయ్య, పిల్లి సుధాకర్,దార్ల శివరాజ్, న్యాయవాది దర్శనం రామక్రిష్ణ, పోలెపాక వెంకన్న, మంద శశి, బేతమల్ల సహదేవ్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, భానోతు బాలు నాయక్, బోడ శ్రీను, రాజేందర్ నాయక్, భూక్య మోహన్, తేజావత్ శ్రీను, చింతకుంట్ల యాకాంబ్రం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube