ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.. అలవోకగా వేయొద్దు
- కాంగ్రెస్ తీరుతో 58 ఏండ్లు గోసపడ్డాం, బాధపడ్డాం
ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.. అలవోకగా వేయొద్దు
– కాంగ్రెస్ తీరుతో 58 ఏండ్లు గోసపడ్డాం, బాధపడ్డాం
– సీఎం కేసీఆర్
టీ మీడియా, నవంబర్ 8, కాగజ్‌నగర్ : సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు తాను ఎమ్మెల్యే అనే గర్వం లేదు.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమైపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. అలాంటి ఎమ్మెల్యేను పొగోట్టుకోవద్దు అని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా.. ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.. ఆషామాషీగా, అలవోకగా ఓటు వేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ రావాల్సిన పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే ప్రజాస్వామ్యంలో పరిణితి వచ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు పోతున్నాయి. మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి లేదు. రావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి. ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తరు అందరికీ తెలసు. మీరు చాలా సార్లు ఓట్లేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి.
Also Read : మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన నలుగురు కిడ్నాప్
ప్రతి పార్టీ తరపున ఒకరు నిలబడుతారు. కోనప్ప బీఆర్ఎస్ తరపు ఉన్నారు. 30న ఓట్లు పడుతాయి. 3న లెక్కింపు అయిపోతది. ఫలితం తేలుతుందన్నారు కేసీఆర్. మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఏందంటే అభ్యర్థి గుణగణాలు, సేవాతత్వం గురించి ఆలోచన చేయాలి. ఆ అభ్యర్థుల వెనుకాల ఏ పార్టీ ఉంది. వాటి చరిత్ర విధానాలు, ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది..? అధికారం వస్తే ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించాలి. ఎన్నికలు అయిపోగానే ప్రక్రియ ఆగిపోదు. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ ఓటు వజ్రాయుధం, చాలా విలువ ఉంటది. ఐదేండ్లు మీ తలరాతను రాస్తది. భవిష్యత్‌ను నిర్ణయిస్తది. అందుకే జాగ్రత్తగా ఓటు వేయాలి. ఆషామాషీగా, అలవోకగా వేయొద్దు. మంచి ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఏ ప్రభుత్వం ఏం చేసిందో లెక్క తీసి ఓట్లు వేస్తే లాభం జరుగుతది. ప్రజాస్వామ్య పరిణితి పెరిగి, విచక్షణ జ్ఞానంతో ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి అని ప్రజలకు కేసీఆర్ సూచించారు.బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్. రాష్ట్రాన్ని సాధించింది. ఈ పదేండ్లు నుంచి ప్రభుత్వం నడుపుతున్నాం. గత ప్రభుత్వాలకు బీఆర్ఎస్ కు తేడా ఆలోచించాలి. అభివృద్ధి మీ కండ్ల ముందుంది. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు.
Also Read : విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ
ఉన్న రాష్ట్రాన్ని బలవంతంగా తీసుకెళ్లి ఏపీలో కలిపారు. దాంతో 58 ఏండ్లు గోస పడ్డం. నష్టపోయాం. బాధపడ్డాం అని కేసీఆర్ పేర్కొన్నారు. 2004లో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామన్నారు కాంగ్రెసోళ్లు. నమ్మి కలిశాం. అప్పుడు అధికారం వచ్చింది. తెలంగాణ వెంటనే ఇవ్వలేదు. ఏడాదికి, రెండేండ్లకు కూడా ఇవ్వలేదు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. 14 ఏండ్లు కొట్లాడితే.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సకల జనుల సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేసి హోరాహోరీ పోరాటం చేస్తే మళ్లీ తెలంగాణ ఇచ్చారు. ఇదంతా మీరు కండ్లారా చూశారు అని కేసీఆర్ తెలిపారు. అనంతరం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కోవా లక్ష్మీకి మద్దతుగా ప్రసంగించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఆసిఫాబాద్‌లో 47 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. వారందరికీ రైతుబందు ఇచ్చాం. రైతుబీమా కూడా పెట్టుకున్నాం. కాగజ్‌నగర్‌లో ఇద్దరు గిరిజనులు చనిపోతే రూ. 5 లక్షల చొప్పున బీమా అందిందని కోనేరు కోనప్ప చెప్పారు. ఆదివాసీ, లంబాడీ తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ఇంకా మిగిలి ఉంటే అది కూడా పూర్తువుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఆసిఫాబాద్ జిల్లా కాకపోయేది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కూడా జిల్లా చేయలేదు. మారుమూల ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా అయితదని కలలో కూడా ఎవరూ అనుకోలేదు.
Also Read :” చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు, పేద వర్గాలకు న్యాయం జరగాలని జిల్లా చేశాం. మీరందరూ చూస్తుండగానే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు కట్టుకున్నాం. నేనే ప్రారంభించాను. ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఒక మంచి మేలు జరిగింది. వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగుల నీళ్లు.. ఆ కలుషిత నీళ్లు తాగి అంటురోగాలు వచ్చేవి. గిరిజన బిడ్డలు రోగాల బారిన పడేవారు. మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇవాళ ఆ బాధ పోయింది. ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ వస్తదని ఎవరూ అనుకోలేదు. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకల హాస్పిటల్ కూడా రావడంతో మన్యం బిడ్డలకు మంచి జరిగింది అని కేసీఆర్ తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube