గుడికి ఎందుకెళ్తారు..

గుళ్లో గంటను ఎందుకని కచ్చితంగా కొడతారో తెలుసా.

0
TMedia (Telugu News) :

గుడికి ఎందుకెళ్తారు..

– గుళ్లో గంటను ఎందుకని కచ్చితంగా కొడతారో తెలుసా…

లహరి, జనవరి 18, ఆధ్యాత్మికం : మనలో చాలా మంది నిత్యం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. మనకిష్టమైన భగవంతుడిని దేవాలయంలో ప్రార్థించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు గుడిలో ప్రదక్షిణలు చేయడం వల్ల, ఆధ్యాత్మిక వాతావరణంలో కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలా మంది భావిస్తారు. ఇదిలా ఉండగా.. గుడికి వెళ్లే వారంతా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.. గుడిలో గంటను ఎందుకు కొడతారు.. ఎందుకని ప్రదక్షిణలు చేస్తారు.. ఏయే నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

​ఆలయ మర్యాదలు పాటించాలి…

హిందూ దేవాలయాల్లో చాలా వరకు వేలాది సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి. ఇవి ఇప్పటికీ చాలా పవిత్రంగా ఉన్నాయి. అందుకే ఇలాంటి పవిత్రమైన స్థలంలోకి అడుగుపెట్టే ముందు శుభ్రమైన, నిరాడంబరమైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. ప్రతి ఒక్కరూ ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే పాదరక్షలను బయట వదిలేయాలి. ఇలా చేయడం అంటే మీరు దేవునికి ఇచ్చే గౌరవానికి సంకేతం.​

Also Read : సత్యనారాయణ పూజా విధానం..

గంట ఎందుకు కొడతారంటే..
ఇక మనం వెళ్లే ప్రతి దేవాలయంలో ముందుగా మనకు ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది. భక్తులందరూ గుడిలో ప్రవేశించిన వెంటనే గంటను కచ్చితంగా కొడతారు. దీనర్థం మీరు దేవాలయానికి హాజరు అయ్యారని అర్థం. అంతేకాదు గుడిలోని గంటను మోగించడం వల్ల ఆ చుట్టూపక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ దూరంగా పోతాయని, మీరు కోరికలన్నీ దేవుడికి చేరుతాయని, తమకు కచ్చితంగా శుభఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో గుడిలో గంట లేకపోతే చేత్తో చప్పట్లు కొడతారు. దీనర్థం కూడా తాము గుడికి హాజరైనట్టు అని అక్కడి స్థానికులు చెబుతారు. అలాగే గుడిలో తలను నేలకు తాకించి పోర్లు దండాలు పెట్టడం అనేది వినయాన్ని ప్రదర్శిస్తుంది. అదే ఇంట్లో మోగించే గంట వల్ల మనసుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.

విగ్రహారాధన..

దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత పూజలు చేయడాన్ని మనం చూస్తు ఉంటాం. అయితే ఈ ఆరాధనలు ఒక్కో గుడిని ఒక్కో విధమైన ఆచారాలు ఉంటాయి. కొన్ని గుళ్లలో ప్రత్యేక యాగాలు జరిపిస్తారు. ఇంకా కొన్ని దేవాలయాల్లో హోమాలు జరుపుతారు. పూజా వస్తువులను సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల దేవుళ్ల నుండి మనకు సానుకూల శక్తి చేరుతుందని చాలా మంది నమ్ముతారు.

Also Read : తులసీ కోటలో దీపం వెలిగిస్తూ ఈ చిన్న పని చేయండి..

​తరచుగా గుడికి వెళ్తే..

శాస్త్రీయ పరంగా చూస్తే దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో కొన్ని లోహలను ఉంచుతారు. వాటి ద్వారా ప్రసరించే కాంతి చాలా శక్తివంతంగా మారుతుంది. అందుకే మనం గుడిలోకి వెళ్లినప్పుడు అది మనకు కూడా లభిస్తుంది. అయితే తరచుగా దేవాలయాలకు వెళ్లే వారికి దేవాలయంలోని సానుకూల శక్తి చేరడం వల్ల ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు దేవాయాలకు వెళ్లే వారికి మానసిక ప్రశాంతత లభించడం కష్టమే అంటున్నారు పండితులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube