ధను సంక్రాంతి ఎందుకు ప్రత్యేకం.?

ధను సంక్రాంతి ఎందుకు ప్రత్యేకం.?

0
TMedia (Telugu News) :

ధను సంక్రాంతి ఎందుకు ప్రత్యేకం.?

లహరి, డిసెంబర్ 16, ఆధ్యాత్మికం : నవగ్రహాల రాజు సూర్యుడు మాసానికి ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా భాస్కరుడు ఒక రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. దీనిని ధను సంక్రాంతి అంటారు. హిందువులకు అన్ని సంక్రాంతిలోకెల్లా ధను సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ధను సంక్రాంతిని ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారంటే.?
సంవత్సరంలో ప్రతి నెల సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు ఒక రాశిని విడిచిపెట్టి మరొక రాశికి వెళతాడు.. ఇలా సూర్యుడి సంక్రమణను సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని ధను సంక్రాంతి అంటారు. ధను సంక్రాంతిని సంవత్సరంలో చివరి సంక్రాంతిగా భావిస్తారు. ధను సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుండి ఖర్మాలు కూడా ప్రారంభమవుతాయి. ఇలా ఒక నెల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో అన్ని రకాల శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలను నెల రోజుల పాటు జరుపుకోరు. ఈ రోజుల్లో పూర్తి భక్తి విశ్వాసాలు ఆచారాలతో సూర్యుడిని పూజిస్తారు. ఇలా ప్రత్యక్ష దైవం సూర్యుడిని పూజించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని.. ఆరోగ్యంగా ఉంటారని.. ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం.

Also Read : కలలో మీకు మీరే కనిపిస్తే శుభామా.? అశుభామా..?

ధన సంక్రాంతిలో ఎలా పూజలు చేయాలంటే.?
హిందూ మత విశ్వాసాల ప్రకారం ధను సంక్రాంతిలో స్నానం చేయడం, సూర్య భగవానుని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున సూర్యభగవానుని భక్తితో పూజించడం వల్ల సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. సూర్యభగవానుడు సకల శుభాలను అందిస్తాడు. రోగాలు దూరమవుతాయి. ఈ రోజుల్లో సూర్యభగవానునితో పాటు శ్రీకృష్ణుడు, విష్ణువు, జగన్నాథుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తాడని విశ్వాసం. మనుషులు రోగాల నుండి విముక్తి పొంది ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సులు వస్తాయని నమ్మకం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube