ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

1
TMedia (Telugu News) :

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
టీ మీడియా, జూలై 8,కామారెడ్డి: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. శారీరక సుఖం కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య. ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.
కర్ణాటక చెందిన రమేష్ (26) అనే యువకుడు తన భార్యతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనములో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఈ జంట వికారాబాద్ పట్టణంలో వాచ్మెన్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన దస్తప్పాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనితో వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా రమేష్ తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు. అయినా రమేష్ భార్య తన ప్రవర్తన మార్చుకోకుండా ప్రియుడు దస్తప్పాను ఇక్కడికి రప్పించుకొని తన శారీరక సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం తెలిసిన రమేష్ భార్యను హెచ్చరించాడు.
తన తన ఆగడాలు కొనసాగాలంటే భర్త రమేష్‌ను అడ్డు తొలగించుకుంటే ఎలాంటి సమస్య ఉండదని తన ప్రియుడితో చెప్పింది. ప్రియుడు దస్తప్పతో కలిసి ఇద్దరు ఎనిమిది రోజుల క్రితం రమేష్‌ను గొంతు నులిమి హత్య చేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టారు.

Also Read : మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు

 

తనపై అనుమానం రాకుండా ఆమె ఒక్కతే కర్ణాటకకు వెళ్ళింది. అక్కడ బంధువులు రమేష్ గురించి అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారు ఆమెను పోలీసులకు అప్పగించారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించడంతో ప్రియుడు దస్తప్పతో పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమె తన ప్రియుడుతో కలిసి రమేష్‌ను హత్య చేసినట్లు తెలిపింది. వారిచ్చిన సమాచారం మేరకు ఆమెను ఎల్లారెడ్డి పోలీసులకు అప్పగించారు. వారిని తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube