టిడిపికి రాజీనామా చేస్తా : ఎంపీ కేశినేని నాని

టిడిపికి రాజీనామా చేస్తా : ఎంపీ కేశినేని నాని

0
TMedia (Telugu News) :

టిడిపికి రాజీనామా చేస్తా : ఎంపీ కేశినేని నాని

టీ మీడియా, జనవరి 6,అమరావతి : త్వరలోనే టిడిపికి రాజీనామా చేయనున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. శనివారం ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”టిడిపికి త్వరలో రాజీనామా చేస్తున్నాను..లోక సభ స్పీకర్‌ అనుమతి కోరాను.. స్పీకర్‌ అపాయింట్మెంట్‌ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా” అని వెల్లడించారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని తెలిపారు.

Also Read : పనికోసం రష్యా-ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్ళొద్దు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube