దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ విజయం

దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ విజయం

1
TMedia (Telugu News) :

దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ విజయం

టి మీడియా, నవంబరు6,న్యూఢిల్లీ :  టీ20 ప్రపంచకప్​లో భాగంగా అడిలైడ్​​ వేదికగా జరిగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది నెదర్లాండ్. సెమీఫైనల్​కు చేరుతుందని భావించిన దక్షిణాఫ్రికా.. 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3 వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు. బాస్ డీ లీడ్, ఫ్రెడ్ క్లాసెన్ రెండేసి వికెట్లు తీశారు.

Also Read : కూనో నేషనల్‌ పార్క్‌లో లార్జర్‌ ఎన్‌క్లోజర్‌లోకి చీతాలు

క్వింటన్ డికాక్ (13), బవుమా (20), మార్కరమ్ (17) క్లాసెన్ (21), మిల్లర్ (17) సహా బ్యాటర్లు అందరూ విఫలం అయ్యారు. రైలీ రోసో (25) టాప్ స్కోరర్​గా నిలిచాడు. *ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా ఓడిపోవడం వల్ల జింబాబ్వే మ్యాచ్​ గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది.మరోస్థానం కోసం పాకిస్థాన్​, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ కు చేరుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube