సన్నబియ్యం ధరలకు రెక్కలు..

మూడు నెలల్లో క్వింటాల్‌ రూ. 6400కి

0
TMedia (Telugu News) :

సన్నబియ్యం ధరలకు రెక్కలు..
-మూడు నెలల్లో క్వింటాల్‌ రూ. 6400కి

టి మీడియా, జనవరి 3,కరీంనగర్ : సన్నరకం బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మూడు నెలల్లో ఏకంగా వెయ్యికిపైగా పెరగడంతో జనాలు లబోదిబోమంటున్నారు. ఇంకా ధరలు పెరుగుతాయని వ్యాపారస్తులు చెబుతుండటంతో.. సామాన్యుల నెత్తి మీద మరో కుదిబండ పడినట్టైంది. ప్రతికూల వాతావరణం, దిగుబడి సరిగ్గా లేకపోవడం లాంటివి బియ్యం ధరలు అమాంతం పెరగడానికి దోహదపడ్డాయి. అంతేకాకుండా సన్నరకం వరిని సాగు చేయడం తగ్గించడంతో.. ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా మారాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్నరకం బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. మూడు నెలల ముందు.. తరువాత.. ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఏకంగా క్వింటాల్ వెయ్యి నుంచి రూ. 1400కు చేరింది. స్థానిక రైతులు సన్నరకం వరిని సాగు చేయడం తగ్గించారు. దొడ్డు వరికి.. సన్నవరికి మద్దతు ధర విషయంలో పెద్దగా తేడా లేదు.

Also Read : బరితెగించిన మెడికల్ మాఫియా

అంతేకాకుండా సన్నవరి సాగు చేస్తే పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల పురుగులు దాడులు చేస్తాయి. దీంతో ఎక్కువగా పిచకారి చేయాలి. గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది. కేవలం ఖరీఫ్ సీజన్‌లోనే సన్నవరి సాగు జరుగుతుంది. ప్రతి ఏటా సన్నవరి సాగు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ధరలు ఆమాంతం పెరిగిపోవడంతో సన్నవరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ మళ్లీ పంట రావడానికి ఆరు నెలల సమయం పడుతుంది. పెరిగిన ధరల కారణంగా సామాన్యుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటి వరకు, బిపిటి క్వింటాల్‌కు రూ. 4 వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 5400కు చేరింది. అదేవిధంగా జై శ్రీరామ్ క్వింటాల్‌కు రూ. 5300 ఉండగా.. ఇప్పుడు రూ. 6500 వరకు అమ్ముతున్నారు. అదే విధంగా హెచ్‌ఎంటీ రూ. 5300 ఉండగా.. ఇప్పుడు రూ. 6400కి చేరింది.

Also Read : పేదలకు ఎంపీ నామ ఆర్థిక చేయూత

దాదాపుగా క్వింటాల్‌కు రూ.1400 వరకు పెరిగిపోయింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని రిటైల్ షాప్ ఓనర్లు చెబుతున్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేసినా.. సరిగ్గా ఎవ్వరూ తినడం లేదు. చాలామంది సన్న బియ్యమే తింటున్నారు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఎన్నడ లేని విధంగా ఒక్కసారిగా క్వింటాల్ వెయ్యికి పైగా ధర పెరిగింది. దీంతో అటు వ్యాపారం.. ఇటు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వ్యాపారస్తులు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube