11 హ‌త్య‌లు చేసిన తాంత్రికుడు అరెస్ట్

11 హ‌త్య‌లు చేసిన తాంత్రికుడు అరెస్ట్

0
TMedia (Telugu News) :

11 హ‌త్య‌లు చేసిన తాంత్రికుడు అరెస్ట్

టీ మీడియా, డిసెంబర్ 12, నాగ‌ర్ క‌ర్నూలు : పూజ‌లు పేరుతో గుప్తనిధులు, ఉద్యోగాలు, మంచి అవకాశాలు.. ఇలాంటి అనేక రకాల కారణాలతో జనాలను మభ్యపెట్టి, మాయచేసి.. మోసం చేయడం.. ఆ తరువాత వారిని హత్య చేసిన తాంత్రికుడు ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు.. వ‌ర‌స హ‌త్య‌ల కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన నాగ‌ర్ క‌ర్నూలు పోలీసులు సిరియ‌ల్ కిల్ల‌ర్ ఆర్ స‌త్య‌నారాయ‌ణ‌ను అరెస్ట్ చేశారు.. ఈ అరెస్ట వివ‌రాల‌ను డిఐజి చౌహ‌న్ విలేక‌రుల‌కు తెలిపారు. అత‌డు మొత్తం 11 హ‌త్య‌లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.. అత‌డిపై ప‌లు జిల్లాల‌లో కేసులు న‌మోదైన‌ట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఓ కుటుంబంలోని నలుగురిని చంపేశాడు ఈ తాంత్రికుడు. ఇటీవల ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆ తరువాత అతను ఉద్యోగం రాకపోవడంతో ప్రశ్నించడంతో.. అతనిని కూడా చంపేశాడు. ఇలా వివిధ ప్రాంతాల‌లో పూజ‌లు పేరుతో డ‌బ్బుల వ‌సూలు చేసి ఆ త‌ర్వాత వారిని హ‌త్య‌లు చేశాడు. హైద్రాబాద్ లో ఓ హత్య కేసుతో ఈ తాంత్రికుడి డొంక అంతా కదిలింద‌న్నారు.

Also Read : వచ్చే పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం

ఈ కేసులో పోలీసులకు చిన్న క్లూ దొరికడంతో దాన్ని పట్టుకుని దర్యాప్తు చేస్తుంటే.. అసలు విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు హంతకుడు ఎవరో తేలడంతో పాటు అతను ఇప్పటికే 11 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అని తేలడంతో పోలీస్ బాసులు షాక్ ఖంగుతిన్నారు. దీంతో ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసి అస‌లు నేర‌స్థుడిని క‌ట‌క‌టాల‌లోకి నెట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube