మహిళలకు భరోసా ఉమెన్స్ హెల్ప్ డెస్క్
-పోలీస్ కమిషనర్
టీ మీడియా,ఏప్రియల్ 17,ఖమ్మం క్రైమ్:
మహిళకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ మరింతదోహదపడుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలు స్వేచ్చగా నిర్భయంగా స్నేహపూర్వకంగా చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళ సహాయ కేంద్రాలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టి అమలు చేస్తుంది.అందులో భాగంగా ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ హెల్ప్ డెస్క్ ను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.
AlsoRead:హీమోఫీలియా.. వామ్మో ఇది ఉంటే నాన్‌స్టాప్ బ్లడ్ బ్లీడింగ్
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులంటే అపోహలు పోగొట్టి ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళ సిబ్బందితో కూడిన మహిళా హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు చేసి మహిళల పట్ల సున్నితంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చిన శిక్షణలో నిర్దేశించామని అన్నారు. మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ .. తద్వారా మహిళలు తమ సమస్యను నిర్భయంగా చెప్పడానికి, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం, పునరావాసం సులభతరం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాధితులకు అండగా నిలిచి…అవసరమైన అన్నిసేవలుఅందిస్తునమన్నారు.కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ , ఏవో అక్తరునీసాబేగం , సిఐ తుమ్మ గోపి, భరోసా కేంద్రం కో-ఆర్డినేటర్ రాజకుమారి పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube