ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌

ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌

0
TMedia (Telugu News) :

ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌

టీ మీడియా, మార్చి 7, అమరావతి: 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన కల్పించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని తెలిపారు. విద్యా దీవెన ద్వారా రూ.6,260 కోట్లు నేరుగా అందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1800 కోట్లు కూడా చెల్లించామని తెలిపారు. ఇలాంటి పథకాలు గత ప్రభుత్వం ఏనాడు అమలు చేయలేదని అన్నారు. సంపూర్ణ పోషణ పథకం ద్వారా 34.16లక్షల మంది మహిళలకు మేలు చేకూరుతోందని తెలిపారు.సంపూర్ణ పోషణ పథకానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్‌, దిశ పీఎస్‌లు తీసుకొచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ రూపొందించామని పేర్కొన్నారు. కోటి 13 లక్షల మంది మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. రెండున్నర ఏళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వెఎస్సార్‌ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. వాలంటీర్లుగా 53 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకు రూ.13వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ చెల్లిస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354కోట్లు నేరుగా జమ చేశామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.9,180 కోట్లు సాయం అందించామని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన చేతిలో పెన్షన్‌ పెడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అ​న్నారు. ​ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ అక్క, ప్రతీ చెల్లెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన చుట్టూ ఉన్నది మహిళా ప్రజా ప్రతినిధులేనని చెప్పారు. ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని తెలిపారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube