సింగరేణిలో మహిళా శక్తిని చాటి చెప్పాలి

సింగరేణిలో మహిళా శక్తిని చాటి చెప్పాలి

1
TMedia (Telugu News) :

సింగరేణిలో మహిళా శక్తిని చాటి చెప్పాలి

టీ మీడియా,అక్టోబర్ 18,గోదావరిఖని : చీకట్లో పనిచేసి వెలుతురు ను ప్రసాదిస్తున్న కష్టజీవులు సింగరేణి కార్మికులు అని కొనియాడారు తెరాస మహిళ నాయకురాలు కందుల సంధ్యారాణి.ఈ మేరకు సోమవారం రామగుండం రీజియన్ వన్ టూ ఏ ఇంక్లైన్ భూగర్భ బొగ్గు గని పని ప్రదేశానికి వెళ్లి కార్మికుల కష్టనష్టాలను బొగ్గు ఉత్పత్తి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి,పని ప్రదేశాన్ని పరిశీలించిన సంధ్యారాణి మాట్లాడారు.

Also Read : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

కష్టనష్టాల్లో ఆడపడుచుగా అండగా నిలుస్తాను అని అన్నారు.సింగరేణి సంస్థలో మహిళా శక్తిని చాటి చెప్పాలిఅన్నారు. పిలుపున ఆడపడుచును ఆశీర్వదించి అండగా నిలవండి అని కార్మికులను కోరారు సంధ్యారాణి,ఈ కార్యక్రమంలో మేనేజర్ వీరాస్వామి,డిప్యూటి ఇంజనీర్ శంకర్,సెక్షన్ ఇంజనీర్ తిరుపతి పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube