డిగ్రీ కళాశాల లోమహిళా దినోత్సవ వేడుకలు

టీ మీడియా,మార్చి 08

0
TMedia (Telugu News) :

డిగ్రీ కళాశాల లోమహిళా దినోత్సవ వేడుకలు.

టీ మీడియా,మార్చి 08, చింతూరు:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల
ప్రిన్సిపాల్ Dr. కె. రత్న మాణిక్యం తెలియచేశారు. ముఖ్య అతిధిగా చింతూరు ఏరియా ఆసుపత్రి దంత వైద్యులు డాక్టర్ . డి . భాగ్య రత్న మేఘన గౌరవ అతిధి గా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి . రఘురామ్ విచ్చేసారు.సభకు అధ్యక్షత వహించిన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కృతి మహిళలను పురుషాధిక్యత క్రింద అనచివేసేలా చేసాయ అన్నారు. నేటి మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ఎదిగి తమ శక్తి సామర్ధ్యాలను చాటి ‘కాదేదీ మహిళలకు అసాధ్యం’ అని నిరూపించుకున్నప్పటికి మన సమాజంలో మహిళలు ఇంకనూ రెండవ తరగతి పౌరులుగానే పరిగణింప బడటం దురదృష్టకరం అన్నారు. అందుకే ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా’ లింగ వివక్షను అదిగమిస్తేనే రేపటి సమాజానికి సుస్థిరత సాధ్యం’ అనే పిలుపును ఇచ్చింది అన్నారు.
ముఖ్య అతిధి గా విచ్చేసిన Dr. మేఘన మాట్లాడుతూ స్త్రీలు అంతా విద్యావంతులు అయినప్పుడు మాత్రమే వారి కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కలిగి ఉన్నప్పటికీ రాజకీయ సాంకేతిక రంగాల్లో, నాయకత్వ స్థానాల్లో మహిళా ప్రాతినిధ్యం తక్కువ కావడం భారతదేశ వెనుకబాటు తనానికి ప్రధాన కారణం అన్నారు. మహిళా సాధికారత, లింగ సమనత్వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నారు.
గౌరవ అతిధి రఘురామ్ మాట్లాడుతూ అనాది నుంచి ఆచార్య వ్యవహారాల పేరుతో స్త్రీలను ఇంటికి పరిమితం చేసి మహిళ హక్కులు కలరాయబడ్డాయి అన్నారు. దీనికి తోడు కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీసహగమనం లాంటి దూరాచారాలు ఆడవారిని ఆటబొమ్మని చేసి ఎదగనియ్యలేదన్నారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులకు నిర్వహించిన రాంగోళి, మెహందీ,మ్యూజికల్ చైర్,హెయిర్ స్టయిల్, పెయింటింగ్,ఖో ఖో,వాలీబాల్,కబడ్డీ పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు బహుమతులు అందచేశారు అనంతరం ముఖ్య అతిధి డాక్టర్ మేఘనను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి. వెంకట రావు, ఎం శేఖర్, ఏ శైలజ, కె. శ్రీదేవి, కె. శకుంతల,జి హారతి, కె శ్రీలక్ష్మి, ఎం నాగమోహన రావు,గౌతమి,కార్యాలయ సిబ్బంది సారబంది ,రవికుమార్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube