స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా మహిళా దినోత్సవం
టీ మీడియా, మార్చి 9,ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో బుధవారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ (CWC) వాసిరెడ్డి భారతీ పాల్గొన్నారు. తొలుత పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య , కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి భారతి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వాసిరెడ్డి భారతి మాట్లాడుతూ నేటి తరం మహిళలు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నతంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు, వివిధ రంగాల్లో తమ కంటూ విశిష్ట స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారని చెప్పారు.
పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చేతన్య మాట్లాడుతూ 1913 లో ప్రారంభం అయిన మహిళా దినోత్సవం దేశ, విదేశాల్లో మార్చి 8 న అంతర్జాతీయంగా వేడుకలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమారి , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.